దేశంలో తొలిసారి 8 సింహాలకి కోవిడ్ పాజిటీవ్ ఎక్కడంటే

దేశంలో తొలిసారి 8 సింహాలకి కోవిడ్ పాజిటీవ్ ఎక్కడంటే

0
32

ఈ కరోనా భయంతో చాలా మంది ఇంటి నుంచి బయటకు రావడం లేదు… ప్రభుత్వాలు అదే చెబుతున్నాయి.. ఇక లాక్ డౌన్ కర్ఫ్యూలు అమలు అవుతున్నాయి. అయితే మనుషులే కాదు పశువులకి కుక్కలకి తమ పెట్స్ కి కూడా కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరీ ముఖ్యంగా వాటికి మాస్క్ పెడుతున్నారు శానిటైజర్ రాస్తున్నారు.

అయితే దేశంలోని మొట్టమొదటిసారి 8 సింహాలు కరోనా బారినపడ్డాయి.

హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లోని ఆసియా సింహాలకు కోవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయ్యింది…తాజాగా సింహాలకు నిర్వహించిన ఆర్టిపిసిఆర్ పరీక్షల్లో ఎనిమిది సింహాలకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు.

 సింహాలలో ఆకలి లేకపోవడం, ముక్కునుంచి రసి కారడం, దగ్గు వంటి కోవిడ్ లక్షణాలను గమనించారు.

దీంతో వెంటనే టెస్ట్ చేస్తే పాజిటీవ్ అని తేలింది…సింహాలు ప్రస్తుతం బాగానే ఉన్నాయని తెలిపారు. ఇక గత ఏడాది అమెరికాలో కూడా ఎనిమిది పులులు, సింహాలకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.. హాంకాంగ్లో కుక్కలు, పిల్లులలో కనిపించింది.