మురుగదాస్ -ఎన్టీఆర్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది

మురుగదాస్ -ఎన్టీఆర్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది

0
96

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హిట్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని గత కొద్ది రోజులుగా తీవ్రమైన ప్రచారం సాగుతోంది, ఈ సినిమా గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పోస్టర్లు డిజైన్ చేశారు, తాజాగా
సూపర్ స్టార్ రజనీకాంత్ తో దర్బార్ సినిమా తెరకెక్కించారు డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్.

ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన నెక్ట్స్ ప్రాజెక్టు జూనియర్ ఎన్టీఆర్ తోనే అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు అన్నారు. చాలాకాలం కిందట ఎన్టీఆర్ కు కథ వినిపించింది నిజమేనని, కానీ అది ఫైనలైజ్ కాలేదని వివరించారు.ఆ కథలో మార్పులు అవసరం అని ఆ కధని పక్కన పెట్టాము అని చెప్పారు మురుగదాస్.

అయితే ఎన్టీఆర్ ని కలసి చాలా కాలం అయింది, ఈ మధ్య ఎలాంటి కథ చర్చించలేదు అని చెప్పారు.. మహేశ్ బాబుతో స్పైడర్ సినిమా గురించి చెబుతూ, తెలుగు ప్రేక్షకుల నాడి పట్టలేకపోయానని తెలిపారు. ఆ సినిమాతో మహేశ్ బాబును తమిళంలో పరిచయం చేద్దామని భావించినా, పూర్తి న్యాయం చేయలేకపోయానని మురుగదాస్ తెలిపారు, అయితే ఎన్టీఆర్ మురుగదాస్ సినిమా లేనట్టే అని క్లారిటీ అయితే వచ్చేసింది.