చెన్నకేశవుల భార్య పరిస్దితి ఏమిటి సర్కార్ సాయం చేస్తుందా

చెన్నకేశవుల భార్య పరిస్దితి ఏమిటి సర్కార్ సాయం చేస్తుందా

0
39

దిశ కేసులో తన భర్తని మిగిలిన ముగ్గురిని పోలీసులు చంపడం తప్పు, ఈ కేసుపై కోర్టు తీర్పు ఇవ్వాలి కదా అప్పటి దాకా ఎందుకు ఆగలేదు, నాకు న్యాయం కావాలి అంటు పోలీసులపై విమర్శలు ఆరోపణలు చేసింది నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుక.

మా అత్త మామ మాత్రమే నాకు ఉన్నారు.. నా పరిస్దితి ఏమిటి, జైలులో ఉంటే కనీసం మాట్లాడటానికి ఉండేది అదీ లేదు
వారు చేసింది తప్పే, కోర్టు శిక్ష వేయాలి పోలీసులు ఇలా చేయకూడదు, నా భర్తని జీవితాంతం జైలులో ఉంచినా తప్పులేదు, నన్ను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు నన్ను బాగానే చూసుకున్నాడు. కాని నాకు తల్లి దండ్రి భర్త లేడు నా బిడ్డకి తండ్రి ఏడని అడిగితే ఎం చెప్పాలి అని కన్నీరు పెట్టుకుంది, తనని ప్రభుత్వం ఆదుకోవాలి అని కోరింది.

వీళ్లని చంపినా జనం మారరు, ఇలా దిశ ఘటన జరిగాక నాలుగు కేసులు జరిగాయి, కోర్టు తీర్పు ఇవ్వక ముందు చంపేశారు, కోర్టు తీర్పులో ఉరి ఉన్నా ఏమీ తప్పు లేదు, చివరి చూపు లేకుండా మాకు చేశారు అని బాధపడింది చివరికి పది రోజులు అవుతున్నాయి.. దీంతో రేణుక కూడా కాస్త శాంతించింది, ఆమెకు మంచి చదువు చెప్పించి ఉన్నతిగా మార్చే ప్రయత్నం సదన్ లో చేయనున్నారు అక్కడ సభ్యులు.