బాలీవుడ్ లో అమితాబ్ తో నాగార్జున చిత్రం షూటింగ్ పూర్తి

బాలీవుడ్ లో అమితాబ్ తో నాగార్జున చిత్రం షూటింగ్ పూర్తి

0
116

నాగార్జున తన సినిమాల స్టైల్ మార్చారు.. అవును ఆయన తాజాగా బాలీవుడ్ లో ఓ చిత్రం కూడా చేశారు. అందులో వారణాసిలో పురాతత్వ శాస్త్రవేత్తగా నాగార్జున పరిశోధనలు చేశారట. బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ జంటగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం బ్రహ్మాస్త్ర… ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్, నాగార్జున, డింపుల్‌ కపాడియా, మౌనీరాయ్‌ కీలక పాత్రధారులుగా చేశారు. సినిమా కోసం అడిగిన వెంటనే ఈ చిత్రానికి ఒకే చెప్పారు నాగార్జున.

ఇక ప్రముఖ నిర్మాత బాలీవుడ్ కింగ్ కరణ్ జోహర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు ..అయితే ఈ సినిమా కథ అంతా ఓ శక్తివంతమైన ఆయుధం చుట్టూ ఉంటుంది అని తెలుస్తోంది. అందులో నాగ్ కీలకమైన సైంటిస్టుగా చేశారట…చేతుల నుంచి నిప్పును రప్పించే శివ పాత్రలో రణ్‌బీర్, ఇషా పాత్రలో ఆలియా కనిపిస్తారట.

ఇక సినిమాలో శివ పాత్రకు అమితాబ్ గురువుగా చేశారు, నాలుగు నెలల క్రితం నాగ్ వారణాసి వెళ్లి షూటింగ్ కూడా ఫినిష్ చేసుకున్నారు.. ఇక మరో విషయం ఏమిటి అంటే, ఈ సినిమా మూడు విభాగాలుగా వస్తుందట , వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలలో తొలి భాగం విడుదల అవనుంది.