Naga babu | నేను కావాలని అలా అనలేదు.. క్షమాపణలు చెప్పిన నాగబాబు.. 

-

మెగా బ్రదర్ నాగబాబు (Naga babu) సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే ఆయన కుమారుడు వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “పోలీస్ ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్ అంటే చూడటానికి హైట్, వెయిట్, మంచి ఫిజిక్ తో ఉండాలి. వరుణ్ దానికి బాగా సెట్ అయ్యాడు. తను 6 అడుగుల మూడు అంగుళాలు ఉన్నాడు కాబట్టి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇలాంటి పాత్రలు 5 అడుగుల మూడు అంగుళాల వ్యక్తులు చేస్తే సెట్ అవ్వదు” అని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఓ హీరో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోనే ఇలా అన్నారంటూ మండిపడుతున్నారు.

- Advertisement -

దీంతో నాగబాబు తాజాగా స్పందించారు. “ఇటీవల జరిగిన వరుణ్ బాబు ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్‌ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను. ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను, ఎవరైనా ఆ మాటలకి నొచ్చుకునుంటే I’m Really Very sorry, అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని కావాలని అన్న మాటలు కాదు. అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను” అంటూ పోస్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...