చైతూ, శోభిత ఎంగేజ్మెంట్.. అసలు విషయం చెప్పేసిన నాగార్జున

-

 Naga Chaitanya Sobhita Dhulipala | చైతూ, శోభిత ఎంగేజ్మెంట్.. అసలు విషయం చెప్పేసిన నాగార్జున ఎట్టకేలకు హీరో అక్కినేని నాగచైతన్య, ప్రముఖ నటి, మోడల్ మధ్య ఉన్న సంబంధంపై క్లారిటీ వచ్చేసింది. సమంత, నాగ చైతన్య 2021 అక్టోబర్ లో వారి పెళ్లి బంధానికి విడాకులతో స్వస్తి చెప్పారు. అప్పటి నుంచి చైతు, శోభిత రిలేషన్ లో ఉన్నారని పుకార్లు షికార్లు కొడుతూనే ఉన్నాయి. ఈరోజు ఆ రూమర్లకు చెక్ పెడుతూ వీరిద్దరూ నిశ్చితార్ధం చేసుకుని అందరినీ షాక్ కి గురి చేశారు. ఈ విషయం స్వయంగా నాగ చైతన్య తండ్రి, హీరో అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు.

- Advertisement -

“ఈ రోజు ఉదయం 9:42 గంటలకు జరిగిన మా అబ్బాయి నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళతో జరిగినట్లు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది!! ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. సంతోషకరమైన జంటకు అభినందనలు! వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. దేవుడు ఆశీర్వదించాలి. 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది” అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.

8.8.8 ని డీకోడ్ చేస్తే… వీరి నిశ్చితార్ధం ఆగస్టు ఎనిమిది 2024 న అయింది. అంటే ఎనిమిదవ నెల ఎనిమిదవ తేదీ 2024 వ సంవత్సరం (2+0+2+4=8). అన్నీ8 సంఖ్యలే. 8ని అడ్డంగా రాస్తే ఇన్ఫినిటీ (∞) సింబల్ అవుతుంది. ఇన్ఫినిటీ అంటే అనంతం. ఈరోజు జరిగిన చైతు, శోభితల( Naga Chaitanya Sobhita Dhulipala) ఎంగేజ్మెంట్ అనంతమైన ప్రేమకి నాంది కావాలని నాగార్జున విష్ చేశారు.

Read Also: యూరిక్ యాసిడ్ సమస్యకు వీటితో చెక్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...