ఆ హీరోయిన్ తో నాగచైతన్య డేటింగ్?

0
97

ఒకప్పుడు నాగచైతన్య, సమంత జంటకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాల అనంతరం వీరి ప్రయాణంలో అనుకోని అవాంతరాలు మొదలయ్యాయి. అవి చివరకు విడాకులకు దారి తీశాయి.

ఇక ప్రస్తుతం వీరిద్దరూ ఫుల్ బిజీగా సినిమాలను చేస్తున్నారు. చైతు థాంక్యూతో, సమంత యశోద సినిమాలో నటిస్తున్నారు. ఇక చై పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు టాక్. అయితే ప్రస్తుతం చైతు గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.

చై హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. నిర్మాణంలో తన కొత్తింటికి ఆమెను చైతు తీసుకెళ్లాడని టాక్. మరి ఈ వార్తపై వారిద్దరిలో ఎవరైనా స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.