షాకింగ్‌ నిర్ణయం తీసుకున్న నాగచైతన్య..

Nagachaitanya made a shocking decision ..

0
91

కరోనా పుణ్యామాని థియేటర్లు మూతపడడంతో ఓటీటీ రంగం బాగా అభివృద్ధి చెందింది. దీనితో జనాలు ఇంట్లోనే సినిమాలు వీక్షించడానికి ఇష్టపడుతున్నారు. ఇక ఓటీటీ రంగంలో వెబ్‌ సెరీస్‌లు పెను సంచలనం సృష్టించాయి. బడా నటీనటులు కూడా వెబ్‌ సిరీస్‌లలో నటించడానికి వెనుకడుగు వేయకపోవడం, బడా నిర్మాణ సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టడంతో వెబ్‌సిరీస్‌ల హవా నడుస్తోంది.

ఈ క్రమంలోనే సమంత, తమన్నా వంటి స్టార్‌ హీరోయిన్‌లు ఇప్పటికే వెబ్‌ సిరీస్‌లలో నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు హీరోలు కూడా వీటిలో నటించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా టాలీవుడ్‌లో ఈ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు యంగ్‌ హీరో నాగచైతన్య.

తాజాగాచైతన్య కూడా ఓ వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పాడు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో నాగచైతన్య నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయాన్ని నాగచైతన్య కూడా ధృవీకరించాడు. అంతేకాకుండా ఈ వెబ్‌ సిరీస్‌ హర్రర్‌ కథాంశంతో వస్తున్నట్లు తెలిపాడు. ఈ వెబ్‌ సిరీస్‌లో నాగచైతన్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. నాగచైతన్య తన కెరీర్‌లో హర్రర్‌ కథలో నటిస్తుండడం ఇదేతొలిసారి కావడం విశేషం. మరి తొలిసారి నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్న నాగచైతన్య ఏమేర ఆకట్టుకుంటాడో చూడాలి. ఇదిలా ఉంటే ఈ వెబ్‌ సిరీస్‌ను అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయనున్నారు.