నిహారిక తోపెళ్లి విషయం పై క్లారిటీ ఇచ్చిన నాగశౌర్య..!!

నిహారిక తోపెళ్లి విషయం పై క్లారిటీ ఇచ్చిన నాగశౌర్య..!!

0
110

మెగా ఫ్యామిలీని టార్గెట్‌గా చేసుకొని ఓ రూమర్ సోషల్ మీడియాలో గత రెండురోజులుగా హల్‌చల్ రేపుతున్నది. నాగబాబు కూతురు నిహారికకు త్వరలో హీరో నాగ సూర్య తో వివాహం జరుగనున్నదనే వార్త వైరల్‌గా మారింది. అయితే ఈ విషయాన్ని గత కొన్ని రోజులుగా మెగా ఫామిలీ కొట్టిపారేసిన ఆ రూమర్స్ మాత్రం ఆగట్లేదు.. తాజాగా ఇదే విషయాన్నీ ఓ ఇంటర్వ్యూ లో నాగ శౌర్య స్పందించారు..

ఇందులో ఎంత మాత్రం నిజం లేదని, ఇది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. ఇటీవల తన స్నేహితుడి ద్వారా ఈ విషయం తెలుసుకున్నానని.. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావన్నారు. ఏదేమైనా సినిమా వాళ్లపైఇలాంటి రూమర్స్ రావడం సర్వసాధారణమైపోయింది.. వాళ్ళు కూడా విని విననట్లుగానే ఉంటున్నారు.. మరి ఈ విషయం పై నిహారిక పెదవి విప్పుతుందో చూడాలి..