వైసీపీలోకి పురంధేశ్వరి

వైసీపీలోకి పురంధేశ్వరి

0
91

ఏపీలో ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారు.. ఎన్నికల ముందు ఏకంగా తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున వైసీపీలో చేరారు నేతలు.. ఎంపీ టిక్కెట్లు ఎమ్మెల్యే టిక్కెట్లు కూడా సంపాదించారు.. అయితే తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ముందు ఇది పెద్ద దెబ్బ కొట్టింది.. ఇప్పుడు వైసీపీలో నేతల చేరికతో పార్టీలో పెద్ద క్యూ ఏర్పడింది. అయితే అధికారంలోకి రాకుండానే జగన్ కు జనాల మద్దతు నాయకుల మద్దతు పెరగడం కూడా ఏపీలో రాజకీయంగా హీట్ పెంచింది..

అయితే ఫలితాలకు మరో 20 రోజులు సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో వైసీపీలోకి మరింత మంది నేతలు చేరనున్నారు అని తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల ముందు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరారు. ఆయన ఎమ్మెల్యేగా పర్చూరు నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు వైసీపీ తరపున ఈ ఐదు సంవత్సరాలు మరింత పటిష్టంగా అక్కడ పేరు తెచ్చుకోనున్నారు. ఇక బీజేపీలో ఉన్న పురంధేశ్వరి బీజేపీ తరపున విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే ఆమె గెలిస్తే బీజేపీలో ఉంటారు అని లేకపోతే వెంటనే వైసీపీలో చేరుతారు అని కొందరు చర్చించుకుంటున్నారు, అయితే ఆమె గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా బీజేపీలోనే కొనసాగుతారు అని తెలుస్తోంది.