ఎన్నికల ప్రచారంలో సన్నీలియోన్..!!

ఎన్నికల ప్రచారంలో సన్నీలియోన్..!!

0
24

పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తన పార్టీ అభ్యర్ధిగా నటుడు సన్నీడీయోల్ ను బరిలోకి దించుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాజ్ కుమార్ చబ్బేవాల్ స్పందిస్తూ మోడీ సర్కార్ దేశాన్ని పాలించడంలో పూర్తిగా విఫలమైందని.. పంజాబ్ లో పోటీ చేసేందుకు బీజేపీకి అసలు అభ్యర్థులే దొరకలేదని ఎద్దేవ చేశారు. గురుదాస్ పూర్ నుంచి నటుడు సన్నీడీయోల్ ను కాదు కదా.. సన్ని సన్నీలియోన్ దించినా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు

రాజ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో శృంగార తార సన్నీలియోన్ పేరు ప్రస్తావించడంపై మిశ్రమ స్పందన వస్తోంది. కాంగ్రెస్ నేతల ప్రచారం శ్రుతి మించుతోందని.. ఎన్నికలతో సంబంధంలేని సన్నీలియోన్ ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. సన్నిడియోల్ ను తెస్తేనే ఇలా భయపడుతన్నారు..సన్నిలియోన్ బరిలోకి దించితే మీ ఓటు కూడా బీజేపీకే పడుతుందని సెటైర్లు వేశారు. మరికొందరు మాత్రం రాజ్ కుమార్ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని సమర్థిస్తున్నారు. బీజేపీపై అదిరిపోయే సైటైర్ వేశారని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై సన్నీలియోన్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే మరి..