జగన్ ప్రమాణ స్వీకారం ఆరోజే డేట్ ఫిక్స్

జగన్ ప్రమాణ స్వీకారం ఆరోజే డేట్ ఫిక్స్

0
99

వైసీపీ అధినేత జగన్ పక్కాగా ఏపీకి సీఎం అవుతారు అని సర్వేలు అన్నీ చెబుతున్నాయి.. అలాగే వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున దీనిపై నమ్మకం పెట్టుకున్నారు.. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి ఈసారి అధికారం రాదు అని అన్ని సర్వేలు చెప్పడంతో, జగన్ కు అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.. ఇక తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అందుకే మౌనంగా ఉన్నారు అని విమర్శలు వస్తున్నాయి. జగన్ ఫలితాలు వచ్చిన తర్వాత మే 26 న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారట. అంతేకాదు ఆ తేదికి ఓ విశిష్టత ఉంది అని చెబుతున్నారు పండితులు.
..

ప్రముఖ శ్రీరామనాడీ జ్యోతిష్యులు మురపాక కాళిదాసుశర్మ జగన్ కు అధికారం వస్తుంది అని రాజయోగం ఉంది అని తెలియచేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 1972 డిసెంబర్ 21న పుట్టార అని ఆయనది ఆరుద్ర నక్షత్రం అని తెలియచేశారు. 2019 మే 26వ తేదీన ధనిష్ట నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రానికి ఇది పరమమైత్రతార. ఆ రోజు ఆదివారం. సప్తమి. భాను సప్తమి అంటారు. సూర్యుడు అన్ని తారలకు అధిపతి. ప్రమాణస్వీకారం, పట్టాభిషేకానికి అలాంటి ముహూర్తాలు చాలా మంచివని పండితులు చెబుతున్నారు. మరి జగన్ ఈ డేట్ ఫిక్స్ చేస్తారా లేదా వేరే తిధి చూస్తారా అనేది చూడాలి.