వరుణ్ తేజ్ ని పిచ్చెక్కిస్తున్న పూజ..!!

వరుణ్ తేజ్ ని పిచ్చెక్కిస్తున్న పూజ..!!

0
93

అప్పటిదాకా హోమ్లీ పాత్రల్లో కనిపించిన పూజా హెగ్డే ఉన్నట్టుండి ‘డీజే’ సినిమాతో రూటు మార్చింది. అప్పటినుంచి ఈమె పై ఆఫర్ల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు అందరు స్టార్ హీరోలతో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే .. తన రెమ్యునరేషన్ ని కూడా భారీగా పెంచేసిందట. తాజాగా ఈమెను సంప్రదించిన ప్రొడ్యూసర్ కి తన రెమ్యూనరేషన్ తో షాక్ ఇచ్చిందట.

హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ్ రీమేక్ గా వాల్మీకి సినిమా తెరకెక్కుతుంది. అధర్వ మురళి హీరోగా.. వరుణ్ తేజ్ నెగటివ్ పాత్ర చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో ముందు వేరే హీరోయిన్ అని అనుకున్నా చివరికి పూజ అయితే వరుణ్ కి సెట్ అవుతుందని ఆమెని సంప్రదించగా ఏకంగా 15 రోజుల కాల్షీట్స్ కోసం 2 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో ముందు దర్శకనిర్మాతలు షాకయినా. ఆమెకున్న క్రేజ్ కారణంగా 2 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.