జగన్ గెలిస్తే పవన్ కు మంచి పోస్టు

జగన్ గెలిస్తే పవన్ కు మంచి పోస్టు

0
112

తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే ఎలాంటి పరిస్దితి ఉంటుంది అని పెద్ద ఎత్తున నేతలు ఆలోచన చేస్తున్నారు.. అయితే మంత్రినారాలోకేష్ తో పార్టీ పైకి వస్తుంది అంటే నమ్మేవారు ఎవరూ లేరు.. అసలు ఆదిలోనే ఆయన పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున విమర్శల పాలు అయ్యారు ..అసలు బాబు ఎన్నికల వారసుడిగా లోకేష్ పేరును ఈసారి గెలిచినా గెలవకపోయినా ప్రకటిస్తారా అంటే డౌట్ అని చెప్పాలి..

అయితే జగన్ సీఎం అయితే కచ్చితంగా ప్రతిపక్షనేతగా పవన్ కల్యాణ్ అవుతాడు అని, ఎందుకు అంటే ఆయన గెలిచేది తక్కువ స్ధానాలు అయినా నిలదీయడం అధికార పార్టీకి సరైన ప్రతిపక్ష పాత్ర ఆయన పోషిస్తాడు అని అంటున్నారు విశ్లేషకులు. అందుకే పవన్ కు మాత్రమే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు..ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున కుప్పం నుంచి చంద్రబాబు గెలిచినా మంగళగిరిలో మంత్రి చినబాబు లోకేష్ గెలుస్తారా లేదా అనేది డౌట్ గా ఉంది..ఇక తెలుగుదేశం పార్టీ నేతలు వారి సీట్లు పై కాకుండా మా చినబాబు సీటు ఏమవుతుంది అని చూస్తున్నారు.