Unstoppable with NBK: బాలయ్యలో ఈ యాంగిల్‌ ఎప్పుడూ చూసుండరు..!

-

Nallari Kiran Kuamr reddy in Unstoppable with NBK show: అన్‌స్టాపబుల్‌తో బాలయ్యలో మరో కోణాన్ని చూస్తున్నారు అభిమానులు. ఊహించని రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ షో.. తాజాగా అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే (Unstoppable with NBK) రెండో సీజన్‌ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ సెకండ్‌ సీజన్‌లో మూడు ఎపిసోడ్స్‌ పూర్తయ్యాయి. తాజాగా నాలుగో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్‌ చేశారు. ఈ ఎపిసోడ్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో పాటు, ఉమ్మడి ఏపీ శాసనసభ స్పీకర్‌ కేఆర్‌ సురేష్‌ రెడ్డి సందడి చేశారు. వీరిద్దరూ బాలయ్యబాబుతో కలిసి, నిజాం కాలేజీలో చదువుకున్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అమ్మాయిల కోసం షికార్లు చేసేవాళ్లం అంటూ అప్పటి కాలేజీ సంగతులు చెప్తుంటే.. బాలయ్యలో ఈ యాంగల్‌ ఎప్పుడూ చూడలేదే అన్నట్లు ఉంది ఈ ఎపిసోడ్‌. వీరితో పాటు అలనాటి అందాల హీరోయిన్‌ రాధిక షోలో సందడి చేశారు.

- Advertisement -

నా మైక్‌ ఆపేశారు అధ్యక్షా అంటూ నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాగానే.. బాలకృష్ణ అన్న మాటలకు నవ్వాగదు. దీంతో, తనకు అర్థరాత్రి 12 గంటలకు ఫోన్‌ చేసిన బాలయ్య, తన మైక్‌ ఆపేశారని చెప్పారని కిరణ్‌ కుమార్‌ రెడ్డి అనటంతో బాలయ్య నవ్వాగదు. నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయకముందు.. ఉమ్మడి ఏపీ స్పీకర్‌గా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా పని చేసిన విషయం తెలిసిందే. అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 1 అంతా సినీ తారలతోనే సందడి చేసిన బాలయ్య, సీజన్‌ 2 లో మాత్రం రాజకీయ నాయకులను సైతం తీసుకురావటం.. అందులోనూ ఫస్ట్‌ ఎపిసోడ్‌లో మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుని తీసుకురావటంతో షోకు మరింత హైప్‌ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...