నాని ‘ అంటే సుందరానికీ’ క్రేజీ అప్డేట్..హీరోయిన్ నజ్రియా ఫస్ట్ లుక్ రిలీజ్

0
110

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ అంటే సుందరానికీ’. ఈ సినిమాలో నాని సరసన మళయాళీ ముద్దుగుమ్మ నజ్రియా ఫహాద్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా… వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

జూన్ 10న ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం నుండి అప్డేట్స్ ఇస్తూ వస్తుంది. తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నాని సరసన నటిస్తున్న నజ్రియా పాత్ర ఎలా ఉండబోతుంది అనే దానికి క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్.

నజ్రియా ఈ మూవీలో లీలా థామస్ గా ఓ క్రిష్టియన్ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో తెలుస్తోంది.  కాగా నజ్రియా తెలుగులో వచ్చిన రాజా-రాణి చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరయింది.