‘చిన జీయర్ స్వామి వ్యాఖ్యల వెనక కేసీఆర్’

0
37

సమ్మక్క- సారలమ్మ దేవతలపై చిన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. చిన జీయర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేయగా తాజాగా టి.పి.సి.సి సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ ఫైర్ అయ్యారు. చిన జీయర్ స్వామి వ్యాఖ్యలు కేసీఆర్ రాజకీయ క్రీడలో భాగమనే అనుమానాలున్నాయి. యాదాద్రి ఆలయ పునరుద్ఘాటనకు దూరంగా పెట్టాలనే ఈ దుమారం లేపారా అని ప్రశ్నించారు.

ఒక వేళ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే ఎక్కడ? ఏ సందర్భములో అన్నారో చెప్పాలి. ఒక వేళ అనియుంటే అవి సమతామూర్తి శ్రీ రామానుజచార్యుల వారి స్ఫూర్తికి విరుద్దము. ఒకే మతంలో వివాదాలు తలెత్తి చిచ్చు చెలరేగే ప్రమాదముంది. ఆధ్యాత్మిక ప్రభోదానికి తమ జీవితాన్ని ధారపోస్తున్న మహోన్నత వ్యక్తిపై వస్తున్న విమర్శల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారి అనుయాయులు ఎంతగానో భాధపడుతున్నారు.

సమతామూర్తి విగ్రహావిష్కరణ నాటి నుండి సీఎం  కెసిఆర్ తో ఏర్పడిన దూరంతో కెసిఆర్ తెలివిగా ఈ వివాదానికి తెరలేపి యాదాద్రి పునరుద్ఘాటనకు చినజీయర్ స్వామి వారు తనంత తానుగా రాకుండా చేశారని భక్తులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చిన జీయార్ స్వామి సీఎంతో పాటుగా తాను ఈ కార్యక్రమంలో పాల్గొంటాననడం గమనార్హం.

సమతామూర్తి దర్శనానికి ధర్మ దర్శనం ఉచితంగా కల్పించాలి. ప్రత్యేక దర్శనానికి పీజు టికెట్ ద్వారా వసూలు చేయవచ్చు. మై హోం అధిపతి రాజేశ్వర్ రావు లాంటి కొందరు స్వామీజీకి చెడ్డ పేరు తెస్తున్నారు. ధర్మము ఒక వైపు, వ్యాపార ప్రయోజనాలు మరొక వైపు పెడితే వీరు వ్యాపార ప్రయోజనాల వైపే మొగ్గు చూపుతారని మరువకూడదని నిరంజన్ ఎద్దేవా చేశారు.