ఫ్లాష్: మోహన్ బాబును కలిసిన మంత్రి పేర్ని నాని

Nani named the minister who met Mohan Babu

0
108

నిన్న ఏపీ సీఎం జగన్ తో సినీరంగ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా గత కొద్దిరోజులుగా టికెట్ల విషయంపై ఇష్యు జరుగుతుంది. ఈ సమస్యపై నిన్న చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ,పోసాని పాల్గొన్నారు. అయితే ఈ భేటీకి మా అధ్యక్షుడు మంచు విష్ణు దూరం ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉంటే తాజాగా మంత్రి పేర్ని నాని నటుడు మోహన్ బాబును కలిశారు. నిన్న జరిగిన సమావేశానికి మోహన్ బాబు హాజరవ్వలేదు. కాగా సీఎం జగన్ తో జరిగిన సమావేశం గురించి.. ప్రస్తావించిన అంశాల గురించి మంత్రి పేర్ని నాని.. మోహన్ బాబుతో చర్చించారు.

మరోవైపు నిన్న భేటీ అనంతరం సినీ నటుడు మ‌హేశ్ బాబు మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ..మొద‌ట‌గా చిరంజీవికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాల‌ని అన్నారు. ఆయ‌న మొద‌టి నుంచీ చొర‌వ చూపి స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేశార‌ని అన్నారు. ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే ఓ గుడ్ న్యూస్ వింటార‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. వారం/ప‌ది రోజుల్లోనే ఆ శుభవార్త వ‌స్తుంద‌ని చెప్పారు.

టికెట్ ధ‌రల వివాదానికి శుభం కార్డు ప‌డింద‌ని భావిస్తున్నామ‌ని చిరంజీవి చెప్పారు. ఏపీ సీఎం నిర్ణ‌యం అంద‌రినీ సంతోష‌ప‌ర్చింద‌ని చెప్పారు. చిన్న సినిమాల‌కు ఐదో షోకు అనుమ‌తించ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని తెలిపారు.