Movie Review: నాని ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ రివ్యూ..

Nani 'Shyam Singarai' Movie Review ..

0
43

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. శుక్రవారం థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. వి, టక్‌ జగదీష్‌ తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? నాని ఖాతాలో మరో హిట్ పడిందా? ‘శ్యామ్ సింగరాయ్’ మెప్పించాడా ఇప్పుడు తెలుసుకుందాం..

నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ రూపొందింది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాను 1970లలో కలకత్తాలో ఉన్న దేవదాసీ వ్యవస్థను ప్రధానంగా చేసుకుని తెరకెక్కించారు. దేవదాసీ పాత్రలో సాయిపల్లవి నటించగా, టైటిల్ రోల్ నాని చేశాడు పోషించారు. బెంగాల్ నేపథ్యంలోని కథతో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కథ ఏంటంటే?

వాసు (నాని) డైరెక్టర్‌ కావాలని ఉంటుంది. అందులో భాగంగా ఓ షార్ట్ ఫిల్మ్ తీస్తాడు. అందులో కీర్తీ (కృతి శెట్టి) నటిస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. సడన్‌గా ఓ కేసులో ఇరుక్కుంటాడు వాసు. అతన్ని కాపాడుకోవడానికి కజిన్‌ (మడోన్న సెబాస్టియన్‌) సాయం కోరుతుంది కీర్తీ. ఈ క్రమంలో వాళ్లకి రోసీ గురించి తెలుస్తుంది. రోసీ సింగరాయ్‌ ఎవరు? ఆమెకు, వాసుకు సంబంధం ఏంటి? మధ్యలో వాసు ఇరుక్కున్న కేసు సంగతి ఏమైంది? వాసుని మనోజ్‌ కేసు నుంచి ఎలా బయటపడేశాడు? అనేది సినిమా థీమ్.

డిఫరెంట్ క్యారెక్టర్ చేసి ఆడియన్స్ నుంచి మార్కులు కొట్టేశాడు నాని. నాని నటనకు డైలాగ్ డెలివరీకి చాలా మంది ఫిదా అయిపోయారు. ముఖ్యంగా నీ పేరు ఏంటీ అంటే శ్యామ్ సింగరాయ్ అంటూ వచ్చే సన్నీవేశం. ఇలాంటి కొన్ని సీన్స్ నానిని స్క్రీన్ పై కొత్తగా చూపించాయి.  ఇంటర్వెల్ బ్యాంగ్, సాంగ్స్, కొన్ని మాస్ సన్నివేశాలతో పాటు నాని- సాయి పల్లవి జోడీ ఈ సినిమాలో హైలైట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ అనే టాక్ రావడం విశేషం. క్లైమాక్ సీన్స్ సినిమాకు ప్లస్. వరుస పరాజయాలతో ఉన్న నాని ఈ సినిమాతో హిట్ కొట్టాడనే చెప్పవచ్చు.

బలం: నాని నటన, సాయిపల్లవి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం.

బలహీనతలు: కొన్ని సన్నివేశాలు, సెకండాఫ్, నేరేషన్ స్లో.