వివాదంలో నాగ శౌర్య సినిమా

వివాదంలో నాగ శౌర్య సినిమా

0
143

ర్తనశాల సినిమాలో హిజ్రాల మనోభావాలు కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని తక్షణం వాటిని సినిమా నుండి తొలగించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ తెలుగు ఫిలిం ఛాంబర్ ముందు ధర్నా కు దిగారు కొంతమంది హిజ్రాలు . నాగశౌర్య హీరోగా నటిస్తున్న @ నర్తనశాల ఈనెల 30న విడుదల అవుతున్న విషయం తెలిసిందే . ఆ చిత్రంలో హీరో క్యారెక్టర్ గే అని కొంతమంది హిజ్రాలకు తెలియడంతో ఫిలిం ఛాంబర్ ముందు ఆందోళనకు దిగారు . హిజ్రాల ఆందోళనతో ఫిలిం ఛాంబర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .

మమ్మల్ని కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించకపోతే @ నర్తనశాల ప్రదర్శిస్తున్న థియేటర్ ల వద్ద నిరసన తెలుపుతామని హెచ్చరిస్తున్నారు . సినిమా విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఈ ఆందోళన టెన్షన్ పెడుతోంది చిత్ర బృందాన్ని . నాగశౌర్య సరసన
అందాల భామలు యామిని భాస్కర్ , కాశ్మీరా పరదేశి నటించారు . ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం పై నాగశౌర్య చాలానే ఆశలు పెట్టుకున్నాడు .