భార్య పై దాడి చేసిన ఎస్ఐ జితేందర్

భార్య పై దాడి చేసిన ఎస్ఐ జితేందర్

0
58

భద్రాది జిల్లా మణుగూరు ఎస్‌ఐ వీరంగం సృష్టించాడు. మరో మహిళతో వివాహేతర సంబంధంపై నిలదీసిన భార్యపై దారుణంగా దాడి చేశాడు. అడ్డొచ్చిన అత్తను కూడా తీవ్రంగా కొట్టాడు. పిడి‌గుద్దులు గుద్ది, కింద పడేసి, కాళ్లతో తన్నాడు. దీంతో ఆమె ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది.

మణుగూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న జితేందర్‌ పాల్వంచకు చెందిన పర్వీన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే జితేందర్ కొద్ది రోజులుగా మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం పర్వీన్ తెలుసుకుంది. దీనిపై ఇద్దరికి కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో జితేందర్ భార్యకు దూరంగా ఉంటున్నాడు. జితేందర్ వివాహేతర సంబంధించిన కొన్ని వీడియోలు పర్వీన్‌కు దొరకడంతో ఆమె జితేందర్‌ను నిలదీసింది. జితేందర్ కోపంతో ఊగిపోతూ రాక్షసంగా ప్రవర్తించాడు. పర్వీన్ తో పాటు ఆమె తల్లిపైనా దాడి చేశాడు. అడ్డొచ్చిన ఓ మహిళను కూడా కొట్టాడు. ఈ దుర్మార్గాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి మీడియాకు అందించాడు.