కుళ్లిన స్థితిలో న‌టుడి మృతదేహం..ఎన్నో అనుమానాలు

Nauti's body in a decomposing state .. many suspicions

0
70

సినీ ప‌రిశ్ర‌మ‌లో ఈ మధ్య వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌రి మ‌ర‌ణ వార్త మరిచిపోకముందే మరో సెల‌బ్రిటీ క‌న్నుమూస్తున్నారు. ఈ క్ర‌మంలో అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా ‘మీర్జాపూర్‌’ సిరీస్‌తో పాటు ‘సూపర్‌30’, ‘దంగల్‌’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మ స్వరూప్ మిశ్రా అనుమానాస్పదంగా మృతి చెందాడు.

ముంబయిలోని వర్సోవా సోసైటీలో అద్దెకుంటుండ‌గా, గత కొన్ని రోజుల నుంచి ఆయన ఇంటి నుంచి బయటకి రాలేదని స్థానికులు తెలుపుతున్నారు. అతను ఉంటున్న గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు బ్రహ్మస్వరూప్‌ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభించింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని ఆస్పత్రికి తరలించారు. అతని మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మిర్జాపుర్​’లో మున్నాభయ్యాగా దివ్యేందు నటిస్తే..అతని సహాయకుడైన లలిత్​ పాత్రలో మిశ్ర కనిపించారు. కేశరీ, బద్రీనాథ్​ కీ దుల్హానియా, హవాయిజాదా, దంగా వంటి చిత్రాల్లో మిశ్ర నటించినా.. మిర్జాపుర్​ వెబ్​సిరీస్​తోనే అతనికి మంచి గుర్తింపు లభించింది.