‘ఆచార్య’ నుంచి ‘నీలాంబరి’ సాంగ్..ప్రోమో అదిరింది!

0
92

మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధానపాత్రలలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఆచార్య మూవీపై అంచనాలు భారీగే ఉన్నాయి. ఈ మూవీని చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆచార్య నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం చిరు అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. దీపావళి కానుకగా.. ఈ మూవీ నుంచి నీలాంబరీ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది చిత్రయూనిట్. నీలాంబరీ.. నీలాంబరీ.. లేరేవ్వరే నీలామరీ.. నీలాంబరీ.. నీలాంబరీ.. నీ అందమే నీ అల్లరి అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా ఇందులో చెర్రీ.. పూజా హెగ్డే లుక్స్ అభిమానులు ఆకట్టుకోవడమే కాకుండా.. చరణ్ స్టెప్పులు సైతం అదుర్స్ అనిపిస్తున్నాయి. ఈ పాట పూర్తి వీడియోను రేపు (నవంబర్ 5న) ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

వీడియో కోసం కింది లింక్ క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=RirDjV84KpY&feature=emb_title