స‌మంత‌కు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే ఆఫ‌ర్ – రెమ్యున‌రేష‌న్ ఎంతంటే ?

Netflix is ​​an exciting offer for Heroine Samantha Akkineni

0
83

ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది స‌మంత‌. ఇక అక్క‌డ నుంచి ఆమెకి అనేక అవ‌కాశాలు వ‌చ్చాయి. స్టార్ హీరోలు అంద‌రితో ఆమె న‌టించింది. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది. అక్కినేని నాగ‌చైత‌న్య‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత కూడా ఆమె సినిమాలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా ఫ్యామిలీ మ్యాన్ -2 వెబ్ సిరీస్‌లో న‌టించిన స‌మంత‌ డిజిట‌ల్ స్క్రీన్‌పై కూడా త‌న సత్తాను చాటుకుంది. ఓటీటీ వ‌ర‌ల్డ్ లో ఎంతో ఫేమ్ సంపాదించుకుంది.తాజాగా స‌మంత‌కు మ‌రో దిగ్గ‌జ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఓ సూప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.

నెట్ ఫ్లిక్స్ తాజాగా స‌మంత లీడ్ రోల్‌లో ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తోంద‌ట‌.. ఈ వెబ్ సిరీస్ కోసం ఏకంగా సామ్ కి 8 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. సో దీనిపై ఇంకా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. మొత్తానికి స‌మంత ఓటీటీ మార్కెట్లో దూసుకుపోతోంది అంటున్నారు ఆమె ఫ్యాన్స్.