New Movies | ప్రతి శుక్రవారం లాగే ఈ శుక్రవారం కూడా థియేటర్లలో సందడి చేసేందుకు నాలుగు సినిమాలు రెడీ అయ్యాయి. ఇందులో ‘ఆదికేశవ’, ‘కోట బొమ్మాళీ పీఎస్’, ‘సౌండ్ పార్టీ’ .. ‘ధ్రువ నక్షత్రం’ సినిమాలు ఉన్నాయి. మెగా హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదలైన మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలు నెలకొనేలా చేసింది. దీంతో మూవీపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.
ఇక సీనియర్ హీరో శ్రీకాంత్, తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కోట బొమ్మాళీ పీఎస్’ కూడా ఈ నెల 24వ తేదీనే విడుదల కానుంది. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. ఇటీవల మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నిర్మాతలందరూ మూవీ జర్నలిస్టులను ఇంటర్వ్యూ చేయడంతో సినిమాకు మంచి పబ్లిసిటీ లభించింది. అలాగే ‘లింగిడి.. లింగిడి’ సాంగ్ కూడా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండడంతో సినిమాపై హైప్ ఏర్పడింది.
New Movies |మరోవైపు తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ధ్రువ నక్షత్రం’ కూడా ఈ శుక్రవారమే థియేటర్లకు రానుంది. అదే రోజున బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీ హీరోగా నటించిన ‘సౌండ్ పార్టీ’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.