సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చంద్రముఖి సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తమిళంతో పాటు విడుదల అయిన అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం దానికి సీక్వెల్ గా ‘చంద్రముఖి 2(Chandramukhi 2)’ వస్తోంది. ఇందులో రాఘవా లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ చంద్రముఖిగా కనిపించనున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘స్వాగతాంజలి’కి భారీ స్పందన రాగా.. తాజాగా విడుదలైన రెండో పాట ‘Moruniye’ ప్రేక్షకులను అలరిస్తోంది.
లారెన్స్ డ్యాన్సింగ్ స్టైల్‌తో సాగిన ఈ పాట.. మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. వివేక్ రాసిన సాంగ్‌ను కీరవాణి కంపోజ్ చేయగా.. ఎస్పీ చరణ్, హారికా నారాయణ్ అద్భుతంగా ఆలపించారు. ఇదిలావుంటే.. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాఘవ లారెన్స్ రాజసం ఉట్టిపడేలా చేతిలో ఖడ్గం పట్టుకొని కనిపించగా సెకండ్ లుక్‌లో చంద్రముఖి భవంతి ద్వారంలోకి వెళ్లి తలుపులో నుంచి లోపలికి చూస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాడు. ఇక ఈ మూవీ తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 19న Chandramukhi 2 గ్రాండ్‌గా విడుదలకానుంది.