నిధి అగర్వాల్.. గతేడాది మున్నా మైఖేల్ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన హిందీలో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగులోనటించి తన టాలెంట్ తో ఇక్కడి వారిని మంత్ర ముగ్దుల్ని చేసింది… ఆ తర్వాత అఖిల్ మిస్టర్ మజ్ను చిత్రంలో నటించిన నిధి అగర్వాల్ కి ఈ సినిమాతో కూడా మంచి పేరు రాగా తన అద్వితీయ నటనతో అందరిని ఆకట్టుకుంది.. చిత్రంలో తన పాత్రకు వంద శాతం న్యాయం చేకూర్చగా డాన్స్ అభినయంతో సినిమాలో తనే హైలైట్ గా నిలిచింది.. తొలి చిత్రంతోనే అందరిని ఆకట్టుకున్న ఈమెకి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలున్నాయని ప్రేక్షకులు అనుకోగా అన్నట్లుగానే ఆమె ప్రస్తుతం పూరి జగన్నాథ్ రూపొందిస్తోన్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నటిస్తోంది.
అయితే ముద్దుగుమ్మను ఓ గుండు వ్యక్తి లిప్టులోనే పట్టేసుకుని నలిపేస్తున్న ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. లిఫ్టులో హీరోయిన్ ను దొరకబుచ్చుకున్న ఆ గుండు కుర్రాడు.. నడుంపై చేయ్యేసి గట్టిగా పట్టేసుకుని.. బలవంతంగా బుగ్గ మీద ముద్దుపెడుతున్న ఫోటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ గుండు కుర్రాడెవరు అనుకుంటున్నారా. ఆయనే నిధి అగర్వాల్ మేకప్ మేన్ షాన్. ఇంటర్నేషనల్ వైడ్ అతడికి మంచి గుర్తింపు ఉంది. కోట్లలో సంపాదించే షాన్ కి ఇండస్ట్రీలో పరిచయాలు చాలా ఎక్కువ. నిధి కూడా అతగాడికి మంచి స్నేహితురాలట. ఆమె ఎంత క్లోజో చెప్పడానికి తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో నిధి.. షాన్ బుగ్గపై ఘాటుగా ముద్దు పెడుతూ కనిపించింది. ఓ ఫోటోలో షాన్ కూడా నిధిని ముద్దుపెట్టుకున్నాడు. ఈ ఫోటోలు పోస్ట్ చేసిన నిధి.. ”జీఎస్ టీ రీయూనియన్” అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇది చూసిన షాన్.. ”బబ్బూ.. మళ్లీ మనం చేశాం.. ఒక పగలు,ఒక రాత్రి ఎప్పటికీ గుర్తుండేలా.. నిన్ను ఎప్పటికీ పిచ్చిగా ప్రేమిస్తూనే ఉంటా.. నువ్ నాకెంతో ప్రత్యేకమైన అమ్మాయివి” అంటూ రిప్లయ్ పెట్టాడు.