జ‌గ‌న్ నీకు ద‌మ్ముంటే నిరూపించు చూస్తా… దేవినేని

జ‌గ‌న్ నీకు ద‌మ్ముంటే నిరూపించు చూస్తా... దేవినేని

0
79

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ తాజా మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మీడియా సాక్షిగా మ‌రోసారి సంచ‌ల‌న‌ స‌వాల్ విసిరారు. ఇటీవ‌లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒకే కూలానికి చెందిన 40 మందికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా డీఎస్పీ ప‌ద‌వులు ఇచ్చార‌ని జ‌గ‌న్ అన్నారు.

అయితే ఎవ‌రికి ప‌ద‌వులు ఇచ్చారో వారిపేర్లు ద‌మ్ముంటే వివ‌రించాల‌ని దేవినేని ఉమా జ‌గ‌న్ స‌వాల్ విసిరారు. తాజాగా మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ 40 మంది పేర్ల‌ను తమ‌కు వివ‌రించ‌క‌పోయినా జ‌గ‌న్ క‌నీసం త‌న సొంత‌ప‌త్రిక‌కు అయినా వివ‌రించాల‌ని డిమాండ్ చేశారు.

ప్ర‌భుత్వంపై అత్యంత దుర్మార్గంగా బుర‌ద జ‌ల్ల‌డ‌మే జ‌గ‌న్ ప‌నిగా పెట్టుకున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. అన్యాయంగా సెక్రెట‌రీ, జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్పీల‌ను బ‌దిలీ చేసిన వేళ ఈ ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అధికారులు ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని విమ‌ర్శించారు.