నిహారిక కొణిదెల పెళ్లి టాపిక్ నిన్నటి నుంచి వైరల్ అవుతోంది, సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టుతో ఇప్పుడు ప్రతీ ఒక్కరు ఆమె వివాహం గురించి చర్చించుకుంటున్నారు, స్టార్ బక్స్ కాఫీ కప్ మీద `మిస్ నీహ` అని రాసి ఉండగా.. s కొట్టేసి..Mrs అనే దానిపై రైట్ మార్క్ వేసింది. మళ్లీ ఓ ట్విస్ట్ కూడా చేసింది. మిస్టర్స్ అనే పదం చివర క్వశ్చన్ మార్క్ కూడా పెట్టింది.
ఆ తర్వాత పోస్టులో తనకు కాబోయే వరుడిని గట్టిగా హాగ్ చేసుకుని కనిపించింది. అయితే ఇందులో మాత్రం అతడి ఫేస్‌ను రివీల్ చేయకుండా ఫ్యాన్స్‌లో సస్పెన్స్‌ను అమాంతం పెంచేసింది. తర్వాత ఫోటోలో అతనితో కలిసి ఉన్న పిక్ పెట్టింది, దీంతో వరుడు ఎవరు అనేది తెలియచేసింది.
నిహారిక కొణిదెలను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు చైతన్య జొన్నలగడ్డ అని తెలుస్తోంది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడని, ఆయన తండ్రి సీనియర్ పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తోంది
గుంటూరుకు చెందిన అబ్బాయిని నిహారిక పెళ్లాడబోతున్నారట, మొత్తానికి ఆగష్టులో నిశ్చితార్దం ఉండనుంది అని వార్తలు వస్తున్నాయి.