Ramayana రిలీజ్ అప్పుడే.. ప్రకటించిన మేకర్స్..

-

భారతదేశ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం భారత ఇతిహాసాలకు డిమాండ్ భలే పెరిగింది. పెద్దపెద్ద డైరెక్టర్లు చాలా మంది భారత ఇతిహాసాలను తెరకెక్కించాలని తపనపడుతున్నారు. ఇటీవల కాలంలో వీటి ఆధారంగా వచ్చిన పలు సినిమాలో బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించాయి. కానీ భారత ఇతిహాసాలను తెరకెక్కించడం అంటే ఒక ఛాలెంజ్‌గా ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల వరకు కూడా సినిమా హిట్టా ఫట్టా అనేది కూడా తెలియదు. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ(Nitesh Tiwari) ఇటువంటి రిస్క్ తీసుకోవడానికి రెడీ అయ్యాడు. ఎప్పటి నుంచో ‘రామాయణ(Ramayana)’ సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్న నితీష్.. ఎట్టకేలకు ఆ జర్నీలో మరో అడుగు ముందుకేశారు. రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor).. రాముడి పాత్రల, సీతగా సాయిపల్లవి(Sai Pallavi) నటిస్తున్నారు ఈ సినిమాలో. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఇన్నాళ్లూ అటకెక్కేసిందనుకున్న సినిమా ఇప్పుడు మళ్ళీ హల్‌చల్ చేస్తోంది.

- Advertisement -

ఈ సినిమా పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. దీంతో పాటుగా ఈ సినిమా(Ramayana) రెండు భాగాల్లో వస్తోందని, తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దేపావళికి రానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో సీతారాములుగా సాయిపల్లవి, రణ్‌బీర్ నటిస్తుండగా.. రావణుడి పాత్రలో కన్నడ నటుడు యశ్(Yash) నటిస్తున్నాడు. అదే విధంగా హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణకగా రకుల్ ప్రీత్‌సింగ్(Rakul Preet Singh) కనిపించనున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో యశ్ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రా సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read Also: తెలుగబ్బాయి అయిపోయిన తమిళ హీరో.. కితాబిచ్చిన నితిన్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...