నితిన్ కొత్త సినిమా ప్రారంభం..యంగ్ బ్యూటీతో నితిన్ రొమాన్స్

0
106

టాలీవుడ్ స్టార్ నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నోఅద్భుతమైన సినిమాలు తీసి మనందరినీ అలరించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా మాచర్ల నియోజక వర్గం సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

ఈ సినిమా  రిలీజ్‌ కాకముందే మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రముఖ రైటర్‌ వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం లో చేయడానికి సిద్ధమయ్యాడు నితిన్. ఈ కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ సినిమాలో పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తోంది.