ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 సరికొత్తగా సాగుతోంది, కొత్తవారిని తీసుకువచ్చి అదరగొడుతున్నాడు బిగ్ బాస్, అయితే చివరి వరకూ గంగవ్వ ఉంటుంది అని అందరూ అనుకున్నారు.. కాని గంగవ్వ మాత్రం అనారోగ్య కారణాలతో హౌస్ ని వీడింది.
నిజమే ఏదైనా హౌస్ లోకి వెళ్లడం మన వంతు, తర్వాత అభిమానులు వేసే ఓట్లు లేదా మనకు ఆరోగ్యం బాగోకపోతే బయటకు వస్తాం, ఇలా గంగవ్వ బయటకు రావడం చాలా మంది జీర్ణించులేదు, తాజాగా సింగర్ నోయల్ కూడా ఈ రోజు హౌస్ ను వీడారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నోయల్, హౌస్ నుండి బయటకు వచ్చాడు, అయితే ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు బిగ్ బాస్ టీమ్, నోయల్ ఓ వారంలో కోలుకుని వస్తే హౌస్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు … అయితే నోయల్ అభిమానులు ఈ ఘటనతో షాక్ అయ్యారు, నోయల్ మళ్లీ హౌస్ లోకి కచ్చితంగా తిరిగి వస్తాడు అని అంటున్నారు.