విజయ్ దేవరకొండ నోటా మూవీ టాక్

విజయ్ దేవరకొండ నోటా మూవీ టాక్

0
128

రీసెంట్ గా గీత గోవిందం సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన విజయ్ దేవరకొండ తాజా గా నటిస్తున్న చిత్రం ‘నోటా’. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ తో విజయ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. విజయ్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న సమయంలో పలు వివాదాలు ‘నోటా’ను చుట్టుముట్టాయి.. అంచనాలతో పాటు.. కాంట్రవర్సీలతోనూ హాట్ టాపిక్ గా నిలిచిన విజయ్ ‘నోటా’ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

నోటా సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే ఇది టోటల్ గా పొలిటికల్ డ్రామా.. ఈ సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అనే చెప్పవచ్చు.. సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఒక కరప్ట్ సియం తన కొడుకును తాత్కాలిక సియంగా చేస్తాడు.. ఇక విజయ్ పోలిటికల్ పాత్రలో అంతా గా సెట్ కాలేదు.. సినిమా ఫస్ట్ ఆఫ్ యావరేజ్ గా ఉన్నప్పటికీ సెకండ్ ఆఫ్ తేలిపోయింది.. సినిమాలో పెద్దగా ఆకట్టుకొనే స్క్రీన్ ప్లే లేదు.. ముఖ్యంగా తమిళ ప్లేవర్ ఎక్కువగా ఉంది.. అక్కడ రాజకీయ పరిస్తితులను బేస్ చేసుకొని కథ రాసుకున్నట్లుగా ఉంది.. ఓవరాల్ సినిమా యావరేజ్ గా ఉందనే చెప్పవచ్చు.