హైదరాబాద్‌ కేసీఆర్‌ అబ్బ సొత్తా?

హైదరాబాద్‌ కేసీఆర్‌ అబ్బ సొత్తా?

0
126

ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. పోటుగాడు త‌న్నుకోవ‌డానికి వ‌స్తాడా? రమ్మనండి అంటూ సవాల్ విసిరారు. ‘కేసీఆర్ నీకు సిగ్గుందా?.. నీలాంటి నీచుడు రాజ‌కీయాల్లో ఉండ‌రు’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం సోనియాగాంధీ కాళ్లు నాకారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో యువ‌త‌ను ఉచ‌కోత కోస్తే… 2009లో చంద్రబాబుతో ఎందుకు పొత్తుపెట్టుకున్నావని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. కేసీఆర్ చేసినవన్నీ దొంగ దీక్షలే అని ఎద్దేవా చేశారు.

ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకునేందుకే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ రోడ్లను చూసి సిగ్గు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. హైదరాబాద్‌ కేసీఆర్‌ అబ్బ సొత్తా? అని…తమకు పదేళ్ల హక్కు ఉందని ఆనందబాబు స్పష్టం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ‌లో ఐటీ దాడులపై మంత్రి స్పందిస్తూ ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయించడం ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు అలవాటే అని అన్నారు. లక్ష కోట్ల రాఫెల్‌ స్కాంపై ఏ దాడులు చేయాలని మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. ఎవరికీ భయపడమని స్పష్టం చేశారు.