ఎన్టీఆర్ – కళ్యాణ్‌రామ్ కాంబినేషన్ ఫిక్స్‌..!

ఎన్టీఆర్ - కళ్యాణ్‌రామ్ కాంబినేషన్ ఫిక్స్‌..!

0
91

నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగు ఇండస్ట్రీ లో హీరో గానే కాక నిర్మాత గా కూడా నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కళ్యాణ్‌రామ్ తన సోదరుడు ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు చాలా సంవత్సరాలుగా వెయిట్ చేశాడు. ఎట్టకేలకు బాబి దర్శకత్వంలో వచ్చిన జై లవకుశ సినిమాతో ఈ కోరిక తీరింది. ఇంకా చెప్పాలంటే జై లవకుశ సినిమాకు ముందు కళ్యాణ్‌రామ్ చాలా అప్పుల్లో కూరుకుపోయాడు.

ఓం -త్రీడీ, కిక్ 2 లాంటి సినిమాలు కళ్యాణ్‌ను నిర్మాతగా తీవ్రంగా నిరాశపరిచాయి. ఇక తాను హీరోగా తన బ్యానర్ మీద చేసిన సినిమాలు సైతం వరుసగా ప్లాప్ అవ్వడంతో కళ్యాణ్ కోలుకోలేనంత నష్టాల్లోకి వెళ్లిపోయాడు. చివరకు జై లవకుశ ఆ అప్పులన్నింటిని తీర్చేసింది. ఇక కళ్యాణ్ ఎన్టీఆర్‌తో మరో సినిమా ప్లాన్ చేసినా సరైన కథ దొరక్కపోవడం తో కళ్యాణ్ రామ్ ఆ ప్రయత్నాన్ని అప్పుడు విరమించుకున్నాడు.

ఇక కొద్ది రోజుల క్రితం మైత్రీ వాళ్లు ఎన్టీఆర్ – కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఒక సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ పార్టనర్ షిఫ్ కోరాడట. అయితే మైత్రీ వాళ్ల మధ్యే గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది కదా… ఇక అలాంటిప్పుడు మళ్లీ అందులోకి కళ్యాణ్‌రామ్ దూరితే ఉపయోగం ఉండదని కళ్యాణ్ కూడా కాస్త వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ మాత్రం కళ్యాణ్ రామ్ కి ఇంకో దారి చూపిస్తున్నాడు. ఎన్టీఆర్. త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా చేసేది ఉంది. బహుశా ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఈ కాంబినేషన్లో సినిమా సెట్ అవ్వవచ్చని తెలుస్తోంది. ఆ సినిమా నిర్మాణం లో కళ్యాణ్ రామ్ ని భాగస్వామి చేయాలి అని తారక్ నిర్ణయించుకున్నాడట. మరి త్రివిక్రమ్ సినిమా అంటే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీదే ఉంటుంది. అంటే ఇప్పుడు కళ్యాణ్ ఆ బ్యానర్‌తో కలిసి తన సోదరుడితో సినిమా నిర్మించాల్సి ఉంటుంది. మరి ఈ డీల్ ఎలా సెట్ అవుతుందో ? చూడాలి.