ఆర్టికల్ 370ని రద్దు పై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు!

ఆర్టికల్ 370ని రద్దు పై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు!

0
36

టాలీవుడ్ టాప్ హీరో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ గత కొంత కాలంగా తన వివాదాస్పద వ్యాఖ్యలతో నెటిజన్ల కోపానికి గురి అవుతున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలన వార్తగా మారుమోగుతున్న ఆర్టికల్ 370 అంశంపై తనదైన శైలిలో కామెంట్ చేశారు. నిన్న జమ్మూ, కశ్మీర్ రాష్ట్ర విభజన, రిజర్వేషన్ల సవరణ బిల్లులను, ‘ఆర్టికల్ 370 సవరణ’ తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించింది.

జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫిరెన్స్ నేత షేక్ అబ్దుల్లా భారత ప్రధాని నెహ్రూ మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే ఈ ఆర్టికల్ 370. ముఖ్యంగా ప్రతి భారతీయుడు ఈ ఆర్టికల్ 370 అంటే ఏమిటో తెలుసుకోవాలి. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్ ఈ ఆర్టికల్ 370 కల్పిస్తుంది. దేశంలో అన్ని రాష్ట్రాలకు 5 సంవత్సారాలకు ఎన్నికలు జరిగితే ఇక్కడ ఆరు సంవత్సారాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.జమ్మూ కాశ్మీర్ లో వుండే కాశ్మీరీ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది.

అదే పాకిస్థాన్ యువకుడిని పెళ్లిచేసుకుంటే మాత్రం పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరి పౌరసత్వం లభిస్తుంది. ఆర్టికల్ 370 మూలంగా RTI చట్టాలు ఇక్కడ పనిచేయవు, RTI ఇక్కడ అప్లై చేయబడదు, కాగ్ కు ఇక్కడ తనిఖీలు చేసే అధికారం లేదు. ఇలాంటి వివాదాస్పద సమస్యలకు చరమగీతం పాడాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకే దీనిపై సమగ్ర నివేదిక తయారు చేసి ఆర్టికల్ 370 వల్ల భారత్ కి జరిగే నష్టాలను పూర్తిగా వివరించారు కేంద్రమంత్రి అమిత్ షా.

అయితే దీనిపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకలు మిన్నంటితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా దీనిపై నటుడు కమల్ హాసన్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. ఆర్టికల్ 370, 35A పుట్టుకకు ఒక నిర్దిష్టమైన కారణం ఉందని అన్నారు. ఇందులో ఏవైనా మార్పులు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. బలవంతంగా ప్రతిపక్షాల నోళ్లు మూయించారని దుయ్యబట్టారు. ఇది తిరోగమన, నిరంకుశ చర్య అని విమర్శించారు. ఇది ఎప్పటికైనా ప్రజాస్వామ్య మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయని అన్నారు.