నందమూరి తారక రామారావు – విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్నగారు అంటే తెలుగువారికి అందరికి అభిమానమే, ఆయన సినిమా నటన, రాజకీయ జీవితం, పేదలకు సేవ, ఇలా అన్నీంటా మంచి కీర్తి గడించారు ఆయన.. వెండితెరపై రాముడైనా, కృష్ణుడైనా, కలియుగ దైవం వెంకన్న అయినా కనిపించింది ఆయనే కాబట్టీ ఆయనని దేవుడిగా చూసేవారు, ఆయన కనిపిస్తే కాళ్లకి నమస్కరించేవారు అందరూ.
ఎన్టీఆర్కు 1951లో విడుదలైన పాతాళ భైరవి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అందులోని తోటరాముడు పాత్రలో
ఎన్టీఆర్ ఒదిగిపోయిన తీరు, తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఆయన రాముడు అనే టైటిల్ తో వచ్చిన అనేక సినిమాలు చేశారు, అది ఆయనకి కలిసి వచ్చింది, అంతేకాదు అలా టైటిల్ తో చేసిన సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి,
అగ్గి రాముడు,
పిడుగు రాముడు,
శభాష్ రాముడు,
టాక్సీరాముడు,
బండరాముడు,
దొంగ రాముడు,
టైగర్ రాముడు
అడవి రాముడు
డ్రైవర్ రాముడు
ఛాలెంజ్ రాముడు
శృంగార రాముడు
కలియుగ రాముడు
సరదా రాముడు
సర్కస్ రాముడు
రాముని మించిన రాముడు
ఇలా 15 సినిమాలు చేశారు, మన దేశంలోనే ఇలా ఎవరూ ఒకే టైటిల్ తో ఇలా సినిమాలు తీసిన హీరో లేరు, అందుకే అన్నగారు అంత గొప్ప హీరో అయ్యారు