ఎన్టీఆర్ త్రివిక్రమ్ కొత్త సినిమా టైటిల్ ఇదే

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కొత్త సినిమా టైటిల్ ఇదే

0
79

ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అల వైకుంఠపురంలో రెండు చిత్రాలు బరిలోకి వచ్చాయి అయితే రెండూ సక్సస్ అయ్యాయి.. అయితే అల వైకుంఠపురం సినిమా దర్శకుడు త్రివిక్రమ్ తాజాగా మరో ప్రాజెక్ట్ ఫైనల్ చేశారు అని తెలుస్తోంది…త్రివిక్రమ్ మరోసారి ఇదే ఫార్మూలా అంటే సంక్రాంతి ఫార్ములా రిపీట్ చేయనున్నాడని టాలీవుడ్ టాక్ నడుస్తోంది.

త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాను ఎన్టీఆర్ తో చేయడం దాదాపు ఖరారైంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసాడు. ఈ సినిమాకు అయినను పోయిరావలె.. హస్తినకు అనే టైటిల్ను ఖరారు చేసినట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు దాదాపు నెల రోజులుగా ఈ చిత్రం గురించి సీన్ వర్క్ రెడీ చేసుకున్నారట, ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. .అయితే ఈ సినిమా నిర్మాత పేరు అలాగే కాస్టింగ్ ఎవరు అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుంది, ఆర్ ఆర్ ఆర్ చిత్రం అయిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేయనున్నారట త్రివిక్రమ్ …అంతేకాదు సంక్రాంతికి ఈ చిత్రం విడుదల చేయాలి అని ప్లాన్ కూడా చేస్తున్నారు. ఈ సినిమా ఫుల్ కామెడీ ప్యాక్ తో ఉంటుంది అంటున్నారు కొందరు.