NTR30 అప్‌డేట్: ఊరమాస్ లుక్‌లో ఎన్టీఆర్.. అదిరిపోయిన టైటిల్

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘దేవర(Devara)’ అని టైటిల్ పెట్టారు. శత్రువులను చీల్చి చెండాడిన సింహంలా.. సముద్రపు ఒడ్డున నిలబడిన కాల యముడిలా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జూనియర్ ఎన్టీఆర్(NTR) కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ను ఎప్పుడూ చూడని ఊర మాస్ లుక్‌లో కొరటాల శివ(Koratala Siva) చూపించబోతున్నట్లు సమాచారం. దీంతో టైటిల్, లుక్ అదిరిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ‘దేవర(Devara)’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డార్క్ థీమ్‌తో డిజైన్ చేశారు. ఎన్టీఆర్ నలుపు రంగు చొక్క, లుంగీలో ఉన్నారు. భుజంపై రక్తంతో తడిచిన తుండు.. ఎడమ చేతిలో రక్తమోడుతున్న పెద్ద కత్తితో సముద్రం వైపు అలసిపోని పోరాట యోధుడిలా ఎన్టీఆర్ చూస్తున్నారు. ఎన్టీఆర్ సరసన ఈ సినిమాలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...