మరోసారి నాని-సమంత..పదేళ్ల తర్వాత ఆ సినిమాలో..

Once again Nani-Samantha..in ten years later in that movie ..

0
104

దాదాపు పదేళ్ల విరాం తర్వాత నేచురల్ స్టార్ నానితో సమంత నటించనున్నట్లు తెలుస్తోంది. నాని కొత్త సినిమా ‘దసరా’లో కీలక పాత్ర కోసం ఆమెను సంప్రదించారట. ఆమె కూడా దీనికి అంగీకారం చెప్పే యోచనలో ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే వీరు కలిసి నటించే మూడో చిత్రం ఇది అవుతుంది. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంగా ఈ సినిమా తీయనున్నారు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల..’దసరా’తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

నాని-సమంత.. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘ఈగ’ సినిమాల్లో జంటగా నటించారు. నాని-కీర్తి సురేశ్ ‘నేను లోకల్’ చిత్రంతో మెప్పించారు. కీర్తి సురేశ్-సమంత.. ‘మహానటి’ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు వీరందరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారనే విషయం ఆసక్తి కలిగిస్తోంది.

దశాబ్ద కాలం నాటి ప్రేమ, నాలుగేళ్ల వివాహబంధానికి స్వస్తి చెబుతున్నట్లు ఇటీవల సమంత-నాగచైతన్య ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే విడిపోవాలనుకుంటున్నట్లు వాళ్లు ప్రకటించారు. ఈ క్రమంలో సామ్‌.. ‘అమ్మ చెప్పింది’ అంటూ తన అభిప్రాయాలను పలు సందేశాల రూపంలో తరచూ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘కాతువక్కుల రెందు కాదల్‌’, ‘శాకుంతలం’ చిత్రాలతోపాటు తాజాగా ఆమె మరో రెండు సరికొత్త ప్రాజక్ట్స్‌ని సామ్‌ ఓకే చేశారు. మరోవైపు ‘లవ్‌స్టోరీ’ విజయం అందుకున్న చై ఇప్పుడు ‘థ్యాంక్‌ యూ’, ‘బంగార్రాజు’ చిత్రీకరణలతో బిజీ అయ్యారు.