వన్ బై టు మూవీ రివ్యూ

-

నటీనటులు : ఆనంద్, శ్రీ పల్లవి , సాయి కుమార్, దేవి ప్రసాద్, కాశీ విశ్వనాధ్ తదితరులు..
డైరెక్టర్ : శివ ఏటూరి
మ్యూజిక్ : లియాండర్ లీమార్టీ & ఆదేశ్ రవి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – సందీప్ కుమార్ కానుగల
డైలాగ్స్ – విజయ భారతి
కెమెరా – శంకర్ కేసరి
ఎడిటర్ – JP
లిరిక్స్ – బాలవర్ధన్ & స్వర్ణ నాయుడు
డాన్స్ – కపిల్
ఫైట్స్ – శంకర్
పబ్లిసిటీ డిజైనర్ – శ్రీకాంత్
విడుదల తేదీ : 22 ఏప్రిల్ 2022

- Advertisement -

చెర్రీ క్రియేటివ్ వర్క్స్ మరియు వీ ఐ పీ క్రియేషన్స్ బ్యానర్ ల పై ఆనంద్, శ్రీ పల్లవి హీరో హీరోయిన్ లుగా డైలాగ్ కింగ్ సాయి కుమార్ ప్రధాన పాత్రలో కరణం శ్రీనివాసరావు నిర్మాతగా చేసిన చిత్రం “వన్ బై టు”. టీజర్ ట్రైలర్ తో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న ఈ సినిమా పై ప్రేక్షకుల లో మంచి అంచనాలు ఉందా ఈ రోజే ఈ సినిమా ఘనంగా విడుదల అయ్యింది. ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా కి లియాండర్ లీ మార్టీ, ఆదేశ్ రవి సాంగ్స్ సంగీతం సమకూర్చగా సందీప్ కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందొ ఈ సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

నగరంలోని బస్తీ లో అల్లరి చిల్లరగా తిరుగుతూ కనపడ్డ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు జై పాండు (ఆనంద్). ఆ సమయంలో ఆ ఏరియా కి కొత్తగా వస్తుంది జెన్నీ (శ్రీ పల్లవి). ఆమెను చూడడగానే ప్రేమలో పడతాడు పాండు. ఆమెకోసం ఎన్నో రిస్క్ లు చేస్తాడు. కానీ జెన్నీ మాత్రం పాండు ప్రేమను అర్థం చేసుకోకుండా రిజెక్ట్ చేస్తుంది. దాంతో తీవ్రమైన బాధలో కూరుకుపోతాడు. ఇదే సమయంలో ఆ బస్తీ లో అన్యాయం జరిగిన వాళ్లకి న్యాయం చేస్తూ ఉంటాడు సాయన్న (సాయి కుమార్). జెన్నీ ఫాదర్ కూతురు కు జరుగుతున్న ఇబ్బంది ని సాయన్న కు చెప్తాడు. సాయన్న పాండు బెదిరించి అమ్మాయి జోలికి వెళ్లొద్దు అంటాడు. అయినా వినని పాండు జన్ని వెంట పడతాడు. అయితే సాయన్న ఇది గమనించి పాండు ను చంపేయబోతాడు. తన పై ఇంత ప్రేమను పెంచుకున్న పాండు ను తాను కూడా లవ్ చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే జెన్నీ గురించి ఓ భయంకరమైన విషయం బయటపడుతుంది. ఆ నిజం తెలిసి జెన్నీ కి దూరంగా ఉంటాడు. జెన్నీ ని అర్థం చేసుకుని పాండు ఆమెకు దగ్గరవుతాడా అనేది సినిమాలో తెలుసుకోవాల్సిందే.

నటీనటులు ;

హీరో పాత్ర లో నటించిన ఆనంద్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. ప్రతి ఫ్రేమ్ లో నూ కనిపిస్తూ సినిమా మొత్తం తన చుట్టూ తిరిగేలా చేసుకున్నాడు. నటన పరంగా, డాన్స్ పరంగా అదరగొట్టాడు. ఎమోషన్ సీన్స్ లో బాగా నటించాడు. హీరోయిన్ గా చేసిన శ్రీ పల్లవి రెండు వేరియేషన్స్ ఉన్న పాత్ర లో చాలా బాగా నటించింది. చివర్లో ఆమె ట్విస్ట్ ను రివీల్ చేసిన తర్వాత చాలా బాగా నటించింది. హీరో కి తగ్గ హీరోయిన్ పాత్ర లో చాలా బాగా నటించింది. సాయి కుమార్ మరొకసారి పవర్ ఫుల్ పాత్ర లో అదరగొట్టాడు. సెంటిమెంట్ సీన్స్ లో తనదైన హావభావాలు పలికించాడు. కాశీ విశ్వనాధ్, దేవి ప్రసాద్ తమ పాత్ర ల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు అనుకున్న పాయింట్ చాలా బాగుంది. ఇలాంటి పాయింట్ గతంలో ఎప్పుడు రాలేదు. కాకపోతే స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త దృష్టి సారిస్తే చాలా బాగుండేది. మాటలు కూడా చాలా బాగున్నాయి. కొన్ని కొన్ని డైలాగ్స్ అందరిని కంటతడి పెట్టిస్తాయి. దర్శకత్వం విషయానికొస్తే ప్రతి ఫ్రేమ్ కూడా ఆకట్టుకుంది. కెమెరామెన్ పనితనం చాలాబాగుంది. ఎడిటింగ్ ఎంతో షార్ప్ గా ఉంది. మ్యూజిక్ పర్వాలేదు. సెంటిమెంటల్ సాంగ్ అందరిని ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఎంతో రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

హీరో, హీరోయిన్స్

కథ

ట్విస్ట్స్

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే

నెమ్మది తనం

తీర్పు :

దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది.

రేటింగ్ : 3/5

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...