ఆస్కార్ బరిలో మనసానమః..ఫస్ట్ తెలుగు షార్ట్ ఫిల్మ్ గా రికార్డ్- Video

0
93

తెలుగు షార్ట్ ఫిల్మ్ గిన్నిస్ రికార్డుకెక్కింది. ప్రేక్షకుల మన్ననలు పొందిన మనసా నమహా ఇప్పుడు సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే ఏ చిత్రానికి రానన్ని అవార్డ్స్ వచ్చేయంటే మనసా నమహా ఎంతలా ఆకట్టుకుంటుందో అర్ధం చేసుకోవచ్చు. దీపక్ రెడ్డి అనే యువకుడు తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ మొట్టమొదటిసారిగా గిన్నిస్ రికార్డుకెక్కిన తొలి లఘు చిత్రంగా నిలిచింది.

ఈ లఘు చిత్రంలో  విరాజ్, అశ్విన్, దృషికా చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీశర్మ ప్రధాన పాత్రలలో నటించారు.. వరల్డ్ వైడ్‌గా ఈ లఘు చిత్రానికి 513 అవార్డులు వచ్చాయి. ఈ చిత్ర టైటిల్ (మనసానమః) ఎటు నుండి చదివిన అలాగే వస్తుంది. ఈ కథ చాలా సింపుల్ గా ఉంటుంది. అమ్మాయిలను అర్ధం చేసుకోవడం ఎంత కష్టమో ఈ లఘు చిత్రంలో తెలుస్తుంది.

ఈ సినిమాలో కథ మొత్తం హీరో కోణంలో చూపించినా..చివర్లో మాత్రం ఓ చిన్న పాపతో ట్విస్ట్ ఇచ్చాడు. ఇందులో సంగీతం, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా అద్భుతంగా అనిపిస్తాయి. ఈ లఘు చిత్రానికి శిల్పా గజ్జల నిర్మాతగా వ్యవహరించారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి..

https://www.youtube.com/watch?v=4ZsTU9ojmpI