పవన్ సినిమా కంటే ముందు హరీష్ ఆ హీరోతో సినిమా చేస్తారా ?

పవన్ సినిమా కంటే ముందు హరీష్ ఆ హీరోతో సినిమా చేస్తారా ?

0
101

టాలీవుడ్ లో మాస్ పల్స్ పట్టుకున్న డైరెక్టర్లో ముందు వివీ వినాయక్ పేరు వినిపిస్తుంది, తర్వాత బోయపాటి పేరు వినిపిస్తుంది, ఆ తర్వాత మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు హరీశ్ శంకర్ పేరు వినిపిస్తుంది.ఇక తన సినిమాల్లో మాస్ డోస్ ఫుల్ ఉంటుంది.. ఆ సినిమాలు కూడా అలాగే సూపర్ హిట్ అవుతాయి… తాజాగా ఆయన చేసిన సినిమాలు ఏం చూసినా ఆహిట్లు మనకు కనిపిస్తాయి…అయితే ఆయన పవన్ కల్యాణ్ తో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నారనే విషయం తెలిసిందే.

 

గబ్బర్ సింగ్ తర్వాత ఈ సినిమా చేస్తున్నారు వీరి కాంబోలో… దీనిపై ఎన్నో ఆశలు ఉన్నాయి అభిమానులకి, ఇక పవన్ చేతిలో ఉన్న రెండు చిత్రాలు పూర్తి అయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అని టాలీవుడ్ టాక్… అయితే దాదాపు ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది.

 

ఈ లోగా మరో సినిమాను చేయాలని హరీశ్ శంకర్ నిర్ణయించుకున్నాడని టాలీవుడ్ టాక్….అందుకు స్టోరీ కూడా సిద్దం అయింది అంటున్నారు, రవితేజ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నారట, షాక్ మిరపకాయ్ సినిమాలు చేశారు.. మిరపకాయ్ ఎంత హిట్ అయిందో తెలిసిందే… మొత్తానికి ఈ వార్త విని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నాయి….అయితే ఇది టాలీవుడ్ టాక్ మాత్రమే… ఇది వాస్తవమా కాదా అనేది అఫీషియల్ ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.