పవన్ సినిమాలో పంజాబ్ బ్యూటీకి ఛాన్స్….

పవన్ సినిమాలో పంజాబ్ బ్యూటీకి ఛాన్స్....

0
93

రకుల్ ప్రీత్ సింగ్ పంజాబ్ నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది… ఎంత తక్కువ సమయంలో స్టార్ డమ్ తెచ్చుకుందో అంతే తక్కువ సమయంలో రకుల్ డౌన్ ఫాల్ మొదలైంది ఒకానొక సమయంలో ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేస్తుందో లేదో అన్న వార్తలు వచ్చాయి…

వరుస కమర్షియల్ సినిమాలు చేసి భారీ విజయాలు అందుకున్నా కూడా ఈ అమ్మడికు ఛాన్స్ లు మాత్రం రాలేదు…… అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఒక బిగ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది… పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కించుకుందట…

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలో పంజాబ్ బ్యూటీ పవన్ తో సరసన చేయబోతుందంటూ వార్తలు వస్తున్నాయి… కాగా వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ చిత్రాన్ని కూడా మొదట్లో అంగీకరించాడు పవన్… మొగలుల పాలనా కాలం నాటి వాతావరణంలో ఈ చిత్రకథ సాగుతుందని అంటున్నారు…