ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో మెగా హీరో ఎవ‌రంటే

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో మెగా హీరో ఎవ‌రంటే

0
88

చిరంజీవి కొర‌టాల సినిమా ఆచార్య ఇప్ప‌టికే షూటింగ్ శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటోంది, అయితే క‌రోనా ప్ర‌భావంతో షూటింగ్ నిలిపివేశారు, ఇక ఈ సినిమా గురించి వార్త‌లు అలాగే వినిపించాయి, ఈ చిత్రంలో ప్రిన్స్ న‌టిస్తున్నారు అని అలాగే చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు అని వార్త‌లు వ‌చ్చాయి.

ఇక మ‌హేష్ బాబు న‌టించ‌డం లేదు అని బ‌య‌ట క్లారిటీ అయితే వ‌చ్చేసింది, ఈ పాత్ర చివ‌ర‌కు చర‌ణ్ చేస్తున్నారు అని ఫైన‌ల్ అయింద‌ట‌. అయితే చ‌ర‌ణ్ ఇప్పుడు మ‌రో సినిమాలో కూడా న‌టించ‌నున్నార‌ట‌, అయితే అది ఎవ‌రిదో కాదు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అని తెలుస్తోంది.

తాజాగా దీనిపై వార్త‌లు వ‌స్తున్నాయి.. చ‌ర‌ణ్ బాబాయ్ సినిమాలో క‌నిపించ‌నున్నాడ‌ట‌, ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ వకీల్ సాబ్ సినిమా చేస్తున్నారు, త‌ర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక చారిత్రక చిత్రం చేయనున్నాడు. ఆంగ్లేయుల పాలనా కాలంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో చరణ్ కూడా కనిపించే అవకాశం ఉందనే ఒక టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.