ప‌వ‌న్ హ‌రీశ్ సినిమా సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేనా ?

Pawan Harish go up the movie sets

0
103

కాస్త క‌రోనా తీవ్ర‌త త‌గ్గింది. దీంతో అన్నీ రంగాలు మళ్లీ ప‌నులు మొద‌లు అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా ప‌రిశ్రమలో కూడా దాదాపు రెండు నెల‌లుగా షూటింగులు నిలిపివేశారు, అయితే మ‌ళ్లీ సినిమాలు ప‌ట్టాలెక్కుతున్నాయి. పెద్ద సినిమాలు షూటింగుల‌కి సిద్దం అవుతున్నాయి. స్టార్ హీరోలు షూటింగు లొకేష‌న్ కు వ‌చ్చేందుకు సిద్దం అవుతున్నారు.

తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా షెడ్యూల్ లో ఉన్న సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నారు.
క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చేస్తున్న పవన్, ఆ తరువాత సినిమాను సాగర్ చంద్ర దర్శకత్వంలో చేస్తున్నారు.

ఈ రెండు సినిమాలు కూడా సెట్స్ పైనే ఉన్నాయి. ఇక మ‌రో సినిమా హరీశ్ శంకర్ సినిమా. తాజాగా టాలీవుడ్ స‌మాచారం ప్ర‌కారం నెల‌కి ప‌దిరోజులు హ‌రీష్ సినిమా కూడా చేసేందుకు ప‌వ‌న్ సిద్దం అయ్యార‌ట‌. టాలీవుడ్ వార్త‌ల ప్ర‌కారం జూలై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ సినిమాపై ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు అభిమానులు.