పవన్ కల్యాణ్ సినిమాలో రానా ? క్లారిటీ ఇచ్చిన రానా

పవన్ కల్యాణ్ సినిమాలో రానా ? క్లారిటీ ఇచ్చిన రానా

0
89

ఇటీవల దగ్గుబాటి వారి అబ్బాయి రానా మహీకను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే, ఇక ఇప్పుడు సినిమా షూటింగులతో ఆయన బిజీ బిజీగా ఉన్నారు, అంతేకాదు కొత్త ప్రాజెక్టులు కూడా వింటున్నారు రానా, ఇక ప్రస్తుతం రానా విరాటపర్వం సినిమా చేస్తున్నారు.

త్వరలో రానా బాబాయ్ వెంకటేశ్ తో కలసి ఓ మల్టీ స్టారర్ చేయడానికి ఓకే చెప్పాడు. ఇది వచ్చే ఏడాది సెట్స్ కి వెళుతుంది. అయితే వారం రోజులుగా రానా పవన్ కల్యాణ్ మూవీలో నటించబోతున్నారు అని అనేక వార్తలు వినిపించాయి.

తాజాగా దీనిపై రానాని అడిగితే క్లారిటీ ఇచ్చారు..మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రాన్ని సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ చేయనున్నారు, అయితే ఇందులో నటించడానికి చిత్ర యూనిట్ తనని సంప్రదించారని ఇంకా దానిని ఫైనల్ చేయలేదు అని చెప్పాడు రానా, సో మొత్తానికి రానా కూడా ఆ పాత్ర నచ్చింది అన్నారు, సో త్వరలోనే దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు.