దుబ్బాకలో గెలిచిన రఘునందన్ రావు ఎవరు ఆయన రియల్ స్టోరీ

దుబ్బాకలో గెలిచిన రఘునందన్ రావు ఎవరు ఆయన రియల్ స్టోరీ

0
36

దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది, మొత్తానికి టీఆర్ఎస్ గెలుపు నల్లేరుమీద నడక అని అందరూ భావించారు.. సర్వే సంస్ధలు ఇదే చెప్పాయి, కాని ఓటరు నాడి మాత్రం ఎవరూ పట్టుకోలేకపోయారు.. ఓటరు కమలం పార్టీకి విజయం ఇచ్చారు, ఇక ఇదే జోష్ తో వారు జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం రెడీ అవుతున్నారు.

బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం గురించి ఏపీ తెలంగాణలో అందరూ మాట్లాడుకుంటున్నారు, అధికార పార్టీపై గెలవడం తో ఆయన గురించి తెలుసుకుంటున్నారు.

మాధవనేని రఘునందన్ రావు రెండుసార్లు ఓటమి పాలైనా మూడోసారి ఆయన విజయం దక్కించుకున్నారు, ఆయన డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. విలేకరిగా మొదలైన మాధవనేని రఘునందన్ రావు జీవితం ఎమ్మెల్యే స్థాయి వరకు వెళ్లింది.

ఆయనకు సిద్దిపేట అంటే చాలా అభిమానం ఇక్కడ బీఎస్సీ చేసిన ఆయన
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బీ పూర్తి చేశారు. తర్వాత ప్రముఖ పత్రికలో జర్నలిస్ట్ గా పని చేశారు, అంచెలంచెలుగా ఎదుగుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా చేరారు.

తెరాస ప్రారంభం నుంచి రఘునందన్ రావు పార్టీలో కీలకంగా పని చేశారు. పొలిట్బ్యూరో సభ్యులుగా, మెదక్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. 2013 లో ఆయన బీజేపీలో చేరారు .. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాని తాజాగా ఉప ఎన్నికల్లో మూడోసారి గెలుపొందారు. సీనియర్ లాయర్ గా పలు కేసులు వాధించిన లాయర్ గా ఆయనకు తెలంగాణలో మంచి పేరు ఉంది.