పవన్ కళ్యాణ్ కొత్త సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా ?

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా ?

0
61

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు తీపి కబురు. పవన్ కళ్యాణ్ మరో సినిమాలో నటిచాలని కోరుకునే వారికి ఇది గుడ్ న్యూసే అని చెప్పవచ్చు . ఆ దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో పవన్ ఈ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇదిలా ఉండగా పవన్ గురించి మరో ఆసక్తికరమైన వార్త కూడా ప్రచారం జరుగుతోంది. నిర్మాతగా కూడా ఒక సినిమా చేసే ఆలోచనలో పవన్ ఉన్నారట. చివరగా అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్ చివరగా నటించిన చిత్రం అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం అభిమానులని నిరాశ పరిచింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా మారిపోయాడు.

ఆంధ్రప్రదేశ్ లో పవన్ పర్యటనలు కొనసాగుతున్నాయి. కొత్త సినిమా కబురు పవన్ సన్నిహిత వర్గాల నుంచి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ లోపు మరో చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది అనే విషయంపై పవన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారట. సన్నిహితులతో, పార్టీ నేతలతో కూడా చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు ఓ చిత్రం విడుదుల చేస్తే ప్రచారానికి బూస్ట్ ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు నెలలో పవన్ దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా కూడా మరో ఆసక్తికర విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ నిర్మాతగా కూడా ఓ సినిమాని చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే నితిన్ తో పవన్ ఛల్ మోహన్ రంగ చిత్రాన్ని నిర్మించాడు. ఇక పొతే ఈ సినిమా పవన్ కి ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రావచ్చు అని తెలుస్తుంది .