పవన్ కల్యాణ్ పెట్టుకున్న రోలెక్స్ వాచ్ ధర ఎంతో తెలుసా

పవన్ కల్యాణ్ పెట్టుకున్న రోలెక్స్ వాచ్ ధర ఎంతో తెలుసా

0
104

పవన్ కల్యాణ్ తాజాగా వకీల్ సాబ్ షూటింగులో పాల్గొంటున్నారు, పవన్ కల్యాణ్ స్టిల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, తాజాగా మెట్రో ప్రయాణం చేసిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి, దీంతో ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

పవన్ కల్యాణ్ గురించి ఎప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండింగ్ నడుస్తుంది. సింప్లిసిటీకి మారు పేరు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఉంటారు, అందుకే ఆయనని చాలా మంది ఇష్టపడతారు, అయితే పవన్ కల్యాణ్ రోలెక్స్ వాచ్ గురించి నెట్టింట ప్రచారం జరుగుతోంది.

ఇంతకీ ఆయన ధరించిన రోలెక్స్ వాచ్ ఖరీదు ఎంత ఉంటుంది అంటే దాదాపు 40 లక్షల వరకూ ఉంటుంది అంటున్నారు, అయితే పవన్ వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ చేస్తున్నారు, ఈ సినిమాలో ఆయన ఈ స్టిల్ లో ఆ రోలెక్స్ ధరించారు. చిత్ర షూటింగ్ కోసం పవన్ కల్యాణ్ ఈ వాచ్ ధరించినట్లు అభిమానులు కూడా తెలియచేస్తున్నారు.